శ్రేయాస్ ఏటీటీ ద్వారా `నర్తనశాల` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈనెల 24 న విజయదశమి సందర్భంగా `నర్తనశాల`లోని 17 నిమిషాల సన్నివేశాల్ని విడుదల చేస్తున్నారు. బాలకృష్ణ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఓ రకంగా సౌందర్య చివరి సినిమా. అయితే ఇది ఉచితంగా చూళ్లేం. టికెట్ కొనాల్సిందే. టికెట్ ధరని 50 రూపాయలుగా నిర్ణయించినట్టు టాక్.
అయితే బాలయ్య అభిమానులకు ఓ ఆఫర్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు ఉపయోగించాలని బాలకృష్ణ భావిస్తున్నారు. అందుకే తన అభిమానుల్నీ ఇందులో భాగస్వాములుగా చేద్దామనుకుంటున్నారు. సాధారణ ప్రేక్షకులకు 50 రూపాయలుగా నిర్ణయించారు. బాలయ్య అభిమాని అయితే టికెట్ ని ఎంతకైనా కొనొచ్చు. కొంతమంది అభిమానులు `నర్తన శాల` టికెట్ ని రూ.10 లక్షలకు కొనాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. వాళ్ల వివరాల్ని త్వరలోనే బాలయ్య ప్రకటించబోతున్నారు.