ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. మధ్యాహ్నం నుంచి ఉత్కంఠ రేపిన ఆరు గంటల ప్రసంగంలో కీలకమైన విధానపరమైన ప్రకటనలు ఏమీ లేవు. పండగల సందర్భంగా ప్రజలు స్వేచ్చగా తిరుగుతున్నారని.. ఈ సమయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు ఆయన జాతినుద్దేశించి ప్రసగించారు. దేశంలో కరోనా రికవరీ రేటు బాగుందని మోదీ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో కరోనా మరణాల రేటు తక్కువని చెప్పి.. కరోనా కట్టడిలో భారత్.. అగ్రదేశాల కంటే ముందుందని చెప్పుకుననారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడుతోందనిన్నారు.
ఇక కరోనాపై పోరాటానికి దేశం ఎలా సిద్ధంగా ఉందో కూడా మోడీ చెప్పుకొచ్చారు. 90 లక్షలకుపైగా కోవిడ్ బెడ్లు అందుబాటులో ఉండటమే కాకుండా.. 2 వేల ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. అయితే కరోనా కేసులు తగ్గాయని నిర్లక్ష్యం చేయవద్దని మోదీక ప్రజలకు హితవు పలికారు. ఇది పండగల సమయం.. మరింత అప్రమత్తంగా ఉండాలని సలహా ఇచ్చారు. మాస్క్ ధరించకుండా బయటికి వస్తే మీ కుటుంబాన్ని రిస్క్‌లో పెట్టినట్లేనని.. కరోనాపై విజయం సాధిస్తున్నాం.. అలసత్వం పనికిరాదన్నారు. కరోనా తగ్గిందని భావిస్తే.. తీవ్ర పరిణామాలకు దారి తీస్తుందని .. వ్యాక్సిన్ కోసం భారత్‌తో పాటు ప్రపంచ దేశాలు శ్రమిస్తున్నాయని మోదీ గుర్తు చేశారు. అందరికీ వ్యాక్సిన్ అందిస్తామని భరోసా ఇచ్చారు. వ్యాక్సిన్ వచ్చే వరకూ అందరూ జాగ్రత్తగా ఉండాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తే.. ఏదో పెద్ద విశేషమే ఉంటుందని అందరూ అనుకుంటారు. అలాగేఅ అనుకున్నారు. పైగా మోడీ కూడా తాను ఆరు గంటలకు ప్రసంగిస్తానని అందరూ చూడాలని సోషల్ మీడియాలో కోరారు. నరేంద్రమోడీ ఇలా టీవీల్లో జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలు ఇప్పటి వరకు.. ప్రజల మనసుల్లో అంతే ఉండిపోయాయి. మొదటి సారి ఆయన నోట్ల రద్దు చేశారు. ఆ తర్వాత జనతా కర్ఫ్యూ విధించారు. అలాంటి షాక్‌లు కాకపోయినా.. కనీసం వ్యాక్సిన్ న్యూస్ లేదా.. ప్యాకేజీ లాంటిది ప్రకటిస్తారేమో అని అనుకున్నారు. కానీ ఏమీ లేకపోవడంతో.. ప్రజలు నిరాశ చెందారు.