ఐపీఎల్ లో మరో రికార్డ్ నమోదయ్యింది. ఈసారి శిఖర్ ధావన్ వంతు. ఐపీఎల్ లో వరుసగా రెండు సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ధావన్ రికార్డు సృష్టించాడు. ఓ బ్యాట్స్‌మెన్ వరుసగా రెండు మ్యాచ్‌లలో సెంచరీ చేయడం ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి. చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో ధావన్ సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు కింగ్స్ లెవన్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్‌లో కూడా ధావన్ సెంచరీ చేశాడు. కేవలం 61 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దాంతో దిల్లీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో5 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో శిఖర్ ధావన్ మరో రికార్డు కూడా సృష్టించాడు. ఐపీఎల్ లో 5000 పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరాడు.