ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌గా.. ఆ తర్వాత రెండు రాష్ట్రాల గవర్నర్‌గా.. ఆ తర్వాత తెంలగాణ గవర్నర్‌గా సుదీర్ఘ కాలం పని చేసిన నరసింహన్.. పదవీ కాలం పూర్తయిన తర్వాత తమిళనాడులో స్థిరపడ్డారు. పదవిలో ఉన్నప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ పట్ల అత్యంత ఆదరణ చూపిన ఆయన ఇప్పుడు… కూడా మర్చిపోలేదు. హైదరాబాద్ వరదల విషయంలో తెలంగాణ సర్కార్ విమర్శలు ఎదుర్కొంటోందని అనుకున్నారేమో కానీ.. రంగంలోకి వచ్చేశారు. చాలా రోజుల తర్వాత ఆయన తరపు నుంచి నుంచి ఓ ప్రకటన వచ్చింది. హైదరాబాద్‌లో నెలకొన్న పరిస్థితిపై ఆందోళన చెందినా… బాధిత ప్రజల కోసం ప్రభుత్వం చేస్తున్న సహాయ పునరావాస కార్యక్రమాలను అభినందిస్తూ ఆయన ప్రకటన జారీ చేశారు.
సీఎం కేసీఆర్ పిలుపు మేరకు.. సహాయ కార్యక్రమాల కోసం తనవంతు సహాయంగా తన వ్యక్తిగత సేవింగ్స్ నుండి 25 వేలు సీఎంఆర్ఎఫ్కు విరాళంగా ఇచ్చారు. నరసింహన్ స్పందనకు కేసీఆర్ కూడా ఫిదా అయ్యారు. కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్ పిలుపుమేరకు పెద్ద ఎత్తున తెలంగాణ సర్కార్‌కు విరాళాలు ప్రకటిస్తున్నారు. మేఘా కంపెనీ పది కోట్లు… మహా గ్రూప్ కంపెనీ ఐదు కోట్లు విరాళాలు ప్రకటించాయి. మరికొంత మంది వ్యక్తిగతంగానూ విరాళాలు ప్రకటిస్తున్నారు. నరసింహన్ స్వల్ప మొత్తమే ఇచ్చినా… కేసీఆర్‌ను సంతోషపరిచింది.
ప్రభుత్వం గురించి మంచి మాటలు చెప్పడమే దానికి కారణం కావొచ్చు. కారణం ఏదైనా… తెలంగాణ ఉద్యమం పీక్స్‌లో ఉన్నప్పుడు.. గవర్నర్‌గా వచ్చిన నరసింహన్ మొదట్లో…. ఉద్యమాన్ని అణిచివేసేందుకు ప్రయత్నించారని టీఆర్ఎస్ నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. రాష్ట్ర విభజన తర్వాత కేసీఆర్‌కు అత్యంత ఆప్తుడయ్యారు.