ఇటీవల రాజశేఖర్ కుటుంబం కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే. జీవిత, రాజశేఖర్ దంపతులతో పాటు శివానీ, శివాత్మికలకు కూడా కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. ఆ తరవాత.. మిగిలినవాళ్లంతా మెల్లగా కోలుకున్నారు. కానీ.. రాజశేఖర్ ఆరోగ్యం మాత్రం ఇంకా కుదుటపడలేదు. ఆయన ఆరోగ్య స్థితి క్లిష్టంగా మారినట్టు తెలుస్తోంది. శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తాయని సమాచారం. ఈ విషయాన్ని శివాత్మిక కూడా తన ట్విట్టర్ లో ధృవీకరించింది. “నాన్నగారి పరిస్థితి క్లిష్టంగానే వుంది. ఆయన కరోనాతో గట్టిగా పోరాడుతున్నారు. మీ అందరి ప్రార్థనలు, ప్రేమతో ఆయన త్వరగా కోలుకుంటారన్న నమ్మకం ఉంద“ని ట్వీట్ చేసింది. ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో రాజశేఖర్ చికిత్స పొందుతున్నారు.