`నా అన్న మన్యం దొర.. అల్లూరి సీతారామరాజు` అంటూ… `ఆర్.ఆర్.ఆర్`లో రామ్ చరణ్‌కి అదిరిపోయే ఎలివేషన్ ఇచ్చాడు ఎన్టీఆర్. రాజమౌళి విజువల్స్‌కి, చరణ్ లుక్, ఫైర్కి… ఎన్టీఆర్ వాయిస్ తోడైంది. సీతారామరాజు ఎంట్రీ – అదిరిపోయింది. టోటల్ గా ఆ టీజరే ఓ సూపర్ హిట్ సినిమా చూస్తున్న ఫీలింగ్ అందించింది.
ఎన్టీఆర్ పాత్ర `కొమరం భీమ్` పాత్రని చరణ్ పరిచయం చేస్తాడని అభిమానులకు అప్పుడే అర్థమైపోయింది. కాకపోతే.. ఒకటే డౌటు. ఎన్టీఆర్ గొంతులో ఉండే ఫైర్, ఆ పొగరు.. చరణ్ గొంతులో క(వి)నిపిస్తాయా? అనుకున్నారు. కానీ.. `నా తమ్ముడు గోండు బెబ్బులి కొమరం భీమ్` అంటూ ఎన్టీఆర్‌కి అదే స్థాయి ఎలివేషన్ ఇవ్వగలిగాడు రామ్ చరణ్. ఈరోజు విడుదలైన కొమరం భీమ్ టీజర్‌కి చరణ్ వాయిస్ కూడా బలమైపోయింది.
మల్టీస్టారర్ సినిమా అంటే అందరికీ క్రేజే. కాకపోతే.. ఇద్దరు హీరోల్ని బ్యాలెన్స్ చేయడమే కష్టం. దాన్ని టీజర్లతోనే సాధ్యం చేసేశాడు రాజమౌళి. చరణ్ టీజర్‌కి ఎన్టీఆర్ గొంతునీ, ఎన్టీఆర్ టీజర్‌కు చరణ్ గొంతుని కలగలిపి – ఆ కాంబినేషన్‌తోనే ఇరు హీరోల ఫ్యాన్స్‌నీ సంతృప్తిపరిచేశాడు. ఇదే బ్యాలెన్స్ కథలోనూ, పాత్రల పంపకంలోనూ, సన్నివేశాల్లోనూ కనిపిస్తే ఈ మల్టీస్టారర్ మ్యాజిక్ చేసినట్టే.