ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రలకు భారీ పెట్టుబడులు వచ్చే్వకాశఆలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులో ఉన్న జీనోమ్ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు అగ్రశ్రేణి సంస్థలు అయిన లారస్ ల్యాబ్స్, గ్రాన్యూల్ ఇండియా సిద్ధమయ్యాయి. ఈ రెండు కలిపి ఏడు వందల కోట్లను పెట్టుబడిగా పెడతాయి. ఈ రెండు కంపెనీల ప్రతినిధులతో కేటీఆర్‌తో సమావేశమయ్యారు. 400 కోట్లతో గ్రాన్యూల్స్ ఇండియా ఒక మాన్యుఫాక్చరింగ్ యూనిట్ నెలకొల్పుతుండగా, 300 కోట్లతో ఇదే రంగంలో లారస్ ల్యాబ్స్ పరిశ్రమను నెలకొల్పుతోంది. ఈ రెండు కంపెనీల ద్వారా కొత్తగా రాష్ట్రంలో 1,750 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ కైనెటిక్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించింది. దేశంలో లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్ గ్రీన్ సంస్థతో 2018లో ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు రూ.1,750 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్, బ్యాటరీ చార్జింగ్ స్టేషన్లు, చార్జింగ్ స్వాపింగ్, ఆర్ అండ్ డీ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కైనటిక్ గ్రీన్ బోర్డు ఆమోదం తెలిపింది. ఆ పెట్టుబడి ఏపీకి వస్తోంది. ఈ విషయంపై లోనే ప్రతిపాదనలు వచ్చాయి. ప్రస్తుతం కార్యాచరణ సిద్ధమవుతోంది.
ప్రస్తుతం కరోనా అనంతర పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతోంది. ఇంత కాలం కంపెనీలు పెట్టుబడుల ప్రతిపాదనల్ని ఎక్కడికక్కడ నిలిపేశాయి. ఇప్పుడు మళ్లీ పాత ప్రతిపానల్ని బయటకు తీస్తున్నారు. వైద్య రంగంలో పెరిగిన అవకాశాల్ని ఉపయోగించుకునేందుకు పెద్ద పెద్ద ఫార్మా కంపెనీలు… ముందుకు వస్తున్నాయి. జీనోమ్ వ్యాలీలో పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. కేవలం ప్రకటనలే కాకుండా.. పెట్టుబడుల వరకూ ఈ ప్రక్రియ సాగితేనే.. నిరుద్యోగ యువతకు అవకాశాలు లభిస్తాయి.