కరోనా ఉరుముతోంది. సెకండ్ వేర్.. ధర్డ్ వేవ్ అంచనాలను నిపుణులు వేస్తున్నారు. ఈ సమయంలో దేశంలో ఎక్కడా స్కూళ్లు తెరిచే సాహసాన్ని ప్రభుత్వాలు చేయడం లేదు. కానీ రోజుకు మూడు వేల కేసుల వరకూ నమోదవుతున్న ఏపీలో మాత్రం… స్కూళ్లు తెరుస్తున్నారు. నిజానికి స్కూళ్లు తెరవాలనే వెసులుబాటు అన్లాక్ నిబంధనల్లో ఇవ్వలేదు. తల్లిదండ్రుల అంగీకారం మేరకే… స్కూళ్లు తెరవాలని సూచించి.. కేంద్రం.. బంతిని రాష్ట్ర ప్రభుత్వాల కోర్టుల్లోకి నెట్టేసింది. దీంతో పిల్లల ప్రాణాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిన అనేక రాష్ట్రాలు… స్కూళ్లు తెరిచే ప్రణాళికుల ఇంకా అమలు చేయలేదు. ఏపీ సర్కార్ మాత్రం.. నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరవాలని నిర్ణయించింది. ఒంటిపూట తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది.
పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలన్నింటికీ వర్తించేలా ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ.. కరోనా విషయంలో యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా ఉందో.. ప్రస్తుతం ఒక్క సారిగా బయటకు చూస్తేనే తెలుస్తుంది. రోగనిరోధక శక్తి ఉన్న వారికి… కరోనా సోకినా లక్షణాలు బయట పడకుండా.. వచ్చి వెళ్లిపోతోంది. కానీ.. వృద్ధులు, పిల్లలకు మాత్రం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతుంది.
అందుకే… మిగతా అన్ని అంశాల్లో సడలింపులు ఇచ్చినా ప్రభుత్వాలు మాత్రం స్కూళ్లు విషయంలో మాత్రం మరో ఆలోచన చేయడం లేదు. ఏపీ సర్కార్ మాత్రం.. ముందుకే వెళ్లాలనుకుంటోంది. కొసమెరుపేమిటంటే.. స్థానిక ఎన్నికల విషయంలో ప్రజల ప్రాణాల్ని రిస్క్ లో పెట్టలేమనే వాదన వినిపిస్తున్న ప్రభుత్వ పెద్దలు స్కూళ్ల విషయంలో మాత్రం.. అదేం పెద్ద విషయం కానట్లుగా వ్యవహరిస్తున్నారు.