హైదరాబాద్: ఆమరణ నిరాహారదీక్షతో సంచలనం సృష్టించిన కాపు సామాజికవర్గ నాయకుడు ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరొక లేఖాస్త్రం సంధించారు. కాపులను బీసీల్లో చేర్చే విషయమై ఏర్పాటు చేసిన మంజునాథ కమిషన్ వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే ఏర్పాట్లు చేయాలని కోరారు. కాపులకు ఇచ్చే రుణాలపై కాలపరిమితిని ఎత్తేయాలని అభ్యర్థించారు. రుణాల మంజూరులో, లబ్దిదారుల ఎంపికలో జన్మభూమి కమిటీల జోక్యం లేకుండా చేయాలని కూడా ముద్రగడ కోరారు. నిరాహారదీక్షకు ముందు కూడా ముద్రగడ చంద్రబాబుకు రెండు బహిరంగ లేఖలు రాశారు. వాటికి ముఖ్యమంత్రి స్పందించకపోవటంతోనే నిరాహారదీక్షకు దిగారు. మరి ఈసారి చంద్రబాబు స్పందిస్తారో, లేదో చూడాలి.