తమన్నా – సత్యదేవ్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం `గుర్తుందా శీతాకాలం`. నాగ శేఖర్ దర్శకుడు. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లబోతోంది. ఇందులో మరో కథానాయికకీ చోటుంది. ఆ పాత్ర కోసం మేఘా ఆకాష్‌ని ఫిక్స్ చేశారు. ఛల్ మోహనరంగ, లై.. తదితర చిత్రాల్లో నటించింది మేఘా ఆకాష్. ఇప్పుడు మరో అవకాశం అందుకున్నట్టైంది. 2020 మేఘాకి బాగానే కలిసొచ్చింది. `మను చరిత్ర` అనే మరో తెలుగు సినిమాలోనూ నటిస్తోందిప్పుడు. ఇవి కాకుండా ఓ తమిళ, ఓ హిందీ చిత్రాలతో బిజీగా ఉంది. `గుర్తుందా శీతాకాలం` ప్రీ ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. త్వరలోనే షూటింగ్ మొదలెడతారు. ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందిస్తున్నారు.