కాపీ రైట్ అనేదానికి సినిమావాళ్లెప్పుడో అర్థం మార్చేశారు. కాపీ చేయడం మా రైట్ అంటూ! ప్రతీ పెద్ద సినిమాకీ కాపీ మరక తప్పదు. దాంతో వివాదాలు, కావల్సినంత ఫ్రీ పబ్లిసిటీ. ఈ కాపీ ఉదంతంపై నాని సెటైర్ వేయబోతున్నాడట. తన తాజా సినిమా `శ్యామ్ సింగరాయ్`లో. నాని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. `టాక్సీవాలా`తో ఆకట్టుకున్న రాహుల్ సంకృత్యయన్ దర్శకుడు. ఈ సినిమాలో నానిది డ్యూయల్ రోల్. ఓ పాత్రలో దర్శకుడిగా కనిపించనున్నాడు. ఈ సందర్భంగానే `కాపీ`లపై సెటర్లు వేశాడట. కథానాయకుడు తీసిన సినిమాపై కాపీ అనే ముద్ర పడితే.. అందుకు కథానాయకుడు స్పందించిన విధానం, `నా సినిమా కాపీ సినిమా కాదు` అని పోరాడే పద్ధతి వినోదాన్ని పంచబోతున్నాయట. అసలు కథంతా ఈ కాపీ.. చుట్టూనే తిరుగుతుందని టాక్. కొలకొత్తా నేపథ్యంలో సాగే ఎపిసోడ్లు కూడా ఆసక్తికరంగా సాగుతాయని తెలుస్తోంది.