ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. మంత్రి పదవి విధులు ఎక్కువగా ఢిల్లీ నుంచే నిర్వహిస్తున్నారు. ఆయన ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు ఆర్థిక మంత్రి నిర్మలా సీతామన్తో పాటు.. ఆమె డిప్యూటీలు నిధులు విడుదల చేే ఇతర వ్యవస్థలు ఏమైనా ఉంటే అందర్నీ కలిసి వస్తున్నారు. ఆయన ఎందుకు అలా కలుస్తున్నారంటే.. పోలవరం నిధుల కోసమని.. మరొకటని మీడియాకు చెబుతున్నారు. పోలవరం నిధుల విషయంలో ఇప్పటికి కేంద్రం చెప్పాల్సింది చెప్పింది. పీపీఏ భేటీ కూడా ముగిసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ తీసుకునే నిర్ణయం ఏమీ ఉండదు.
కానీ బుగ్గన ఢిల్లీలో అదే పనిగా కేంద్ర ఆర్థిక శాఖలో ఎక్కేగడప దిగే గడప అన్నట్లుగా వ్యవహరిస్తోంది అప్పులకు గ్యారంటీ పొందడానికన్న చర్చ జరుగుతోంది. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఓ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి రూ. పాతిక వేల కోట్లు అప్పు చేయాలని అనుకుంటోంది. ఆ అప్పు కోసం ఏపీ సర్కార్ గ్యారంటీ ఇచ్చే పరిస్థితి లేదు. అలా గ్యారంటీ ఇస్తే ఆరేడు వేల కోట్లు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడా గ్యారంటీ పరిధిని పెంచుకోవడానికి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అదే పనిగా ఢిల్లీకి వెళ్తున్నారని చెబుతున్నారు. గతంలో కూడా.. ఓ అమెరికన్ కంపెనీ రూ. 70వేల కోట్ల లోన్ ఇస్తానంటోందని.. గ్యారంటీ ఇవ్వాలని కేంద్రం వద్ద లాబీయిం్ చేశారు.
చివరికి అదేమైందో కానీ.. ఇప్పుడు మళ్లీ అదే అప్పు కోసం గ్యారంటీ ఇవ్వడమో.. ఏపీ ప్రభుత్వ గ్యారంటీ పరిధి పెంచడమో చేయాలని ఆయన బతిమాలుతున్నట్లుగా చెబుతున్నారు. బయటకు మాత్రం పోలవరం నిధుల కోసం తెగ ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంక్షోభంఅంచనా వేయలేని స్థితికి దిగజారిపోతోంది. పెండింగ్ బిల్లులు రూ. లక్ష కోట్ల వరకూ ఉన్నాయి. అభివృద్ది పనులకు రూపాయి ఖర్చు చేయలేకపోతున్నారు. కానీ ఏడాదిన్నరలోనే లక్షన్నర కోట్ల వరకూ అప్పులు చేశారు. తిరిగి చెల్లింపులు ప్రారంభమయ్యే పరిస్థి ఉండటంతో ఆర్థిక శాఖ టెన్షన్ పడుతోంది.