ఏంటో.. నందమూరి బాలకృష్ణ కు హీరోయిన్ కష్టాలు తప్పడం లేదు. బాలయ్య – బోయపాటి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇద్దరు కథానాయికలు. ఓ కథానాయికగా పక్క రాష్ట్రం నుంచి ప్రయాగా మార్టిన్ ని తీసుకొచ్చారు. మరో కథానాయికగా పూర్ణని ఎంచుకున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ప్రయాగ మార్టిన్ బయటకు వెళ్లిపోయినట్టు టాక్. ఇటీవల… ప్రయాగ సెట్లో అడుగుపెట్టింది. ఆమెపై రెండు సీన్లు తీశారు. రషెష్ చూశాక.. బాలయ్య పక్కన ప్రయాగ ఏమాత్రం సరితూగదని భావించినట్టు తెలుస్తోంది. అందుకే ప్రయాగని ఈ ప్రాజెక్టు నుంచి బయటకు పంపార్ట. ఆ స్థానంలో.. ప్రగ్యా జైస్వాల్ ని తీసుకున్నట్టు సమాచారం. సోమవారం నుంచి ప్రగ్యా సెట్లో అడుగుపెట్టే అవకాశాలున్నాయి. అయితే.. ప్రగ్యా అయినా బాలయ్యకు సరిజోడీనా..? అన్నదీ డౌటే. బడ్జెట్ కాస్త హీరోయిన్లకూ కేటాయించగలిగితే.. మంచి స్టార్ హీరోయిన్ ని వెదికి పట్టుకునేవాళ్లు. కానీ… సమస్యంతా అక్కడే ఉంది. హీరోయిన్ల విషయంలో బడ్జెట్ సర్దుబాటు కాకపోవడంతో.. ఇలా ప్రగ్యా జైస్వాల్‌తోనూ, పూర్ణతోనూ సర్దుకుపోవాల్సివస్తోంది.