దేశం దృష్టిని ఆకర్షిస్తున్న బీహార్ ఎన్నికల్లో మూడు దశల పోలింగ్ ముగిసింది. ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. పదిహేళ్ల పాటు సీఎంగా మిస్టర్ క్లీన్ నితీష్ కుమార్‌కు ఎగ్జిట్‌పోల్స్ ఎగ్జిట్ ఖాయమని అంచనా వేశాయి. పోటీ హోరాహోరీగా ఉంటుదని అంచనా వేసినప్పటికి మొగ్గు మాత్రం ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమికే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. టైమ్స్‌నౌ- సీ ఓటర్ సర్వే ఎన్డీఏకు 116 సీట్లు అంచనా వేయగా.. మహాకూటమికి 120 సీట్లు అంచనా వేసింది. పీపుల్స్ పల్స్ సర్వే కూటమికి 100-115 స్థానాలు .. ఎన్డీయేకు 90-110 స్థానాలు రావొచ్చని పేర్కొంది. ఇతర సర్వేలు సైతం మహా కూటమికే ఆధిక్యం చూపించాయి. రిపబ్లిక్ టీవీ – జన్‌కీ బాద్ సర్వే అత్యధికంగా ఆర్జేడీ కూటమి 138 స్థానాల వరకూ రావొచ్చని అంచనా వేసింది. అయితే స్పష్టమైన మెజార్టీ మాత్రం ఎవరికీ వస్తాయని చెప్పలేకపోయాయి. బీహార్‌లో మొత్తం 243 స్థానాలు ఉన్నాయి మూడుదశల్లో ఎన్నికలు జరిగాయి.
మెజార్టీ మార్క్ రావాలంటే 122 సీట్లు తెచ్చుకోవాలి. ఎల్జేపీ ఐదారు సీట్లు తెచ్చుకుంటే.. కీలక పాతర్ పోషించే అవకాశం ఉంది. బీహార్‌లో నిరుద్యోగం ఈ సారి కీలక పాత్ర పోషించింది. అధికారంలోకి వస్తే పది లక్షల ఉద్యోగాలిస్తానని.. ఆర్జేడీ నేత.. లాలూ తనయుడు.. మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించారు. దీంతో ఆయన వైపు యువత మళ్లారు. అదే సమయంలో.. సుదీర్ఘ కాలంగా పదవిలో ఉన్న నితీష్ కుమార్ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని అంచనా వేశారు. మోడీ, నితీష్ కుమార్ విస్తృతంగా ప్రచారం చేసినా.. . తేజస్వి ఒంటరిగా ఎదుర్కొని నిలబడ్డారు.
మధ్యప్రదేశ్‌లో ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా ప్రభుత్వాన్ని కూల్చేసి.. కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ. తనకు మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యేల స్థానాల్లో ఉపఎన్నికలు నిర్వహించింది. మొత్తం 28 స్థానాలకు ఎన్నికలు జరగ్గా అక్కడ కాంగ్రెస్ 18 స్థానా ల వరకూ గెలుచుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నార.ు 9 స్థానాల కన్నా తక్కువ గెల్చుకుంటే బీజేపీ ప్రభుత్వం రిస్క్‌లో పడుతుంది.