వెంకటేష్, రానా… వీళ్లిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా చేయాలని సురేష్ బాబు చేయని ప్రయత్నం లేదు. అనుకోకుండా వెంకీ, నాగచైతన్య కాంబో కుదిరి.. `వెంకీ మామా` రూపంలో హిట్టు దొరికింది. ఇక మిగిలింది వెంకీ, రానా కాంబోనే. అందుకు తగిన కథ ఇప్పుడు దొరికేసింది. త్వరలోనే ఈ కాంబో పట్టాలెక్కబోతోంది. ఈ విషయంపై రానా కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
”మా ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రావాలని అందరూ ఎదురు చూస్తున్నారు. మా నిరీక్షణ కూడా దాని కోసమే. ఇన్నాళ్లు ఎలాంటి కథ కోసం ఎదురు చూశామో… అలాంటి కథ దొరికింది. అన్ని పనులూ పూర్తయ్యాయి. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తాం..” అని రానా చెప్పేశాడు. 2021లోనే ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. స్క్రిప్టు పనులు ఓ కొలిక్కి వచ్చినట్టు సమాచారం. అతి త్వరలో దర్శకుడి పేరుని, ఈ కాంబోని అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి.