కోవిడ్ 19 ఇప్పుడు మెగా ఇంట్లో ఎంటర్ అయ్యింది. చిరంజీవికి కరోనా పాటిటీవ్ గా నిర్దారణ అయ్యింది. ఈ విషయాన్ని చిరంజీవినే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. “ఆచార్య షూటింగ్ ప్రారంభించాలని కోవిడ్ టెస్ట్ చేయించుకున్నాను. రిజల్ట్ పాజిటీవ్. నాకు ఎలాంటి కోవిడ్ లక్షణాలూ లేవు. వెంటనే హోమ్ క్వారంటైన్ అయ్యాను. గత 4 – 5 రోజులుగా నన్ను కలిసినవాళ్లంతా టెస్ట్ చేయించుకోవాల్సింగా కోరుతున్నా. ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితి మీకు తెలియ జేస్తా“ అని ట్వీట్ చేశారు.
ఇటీవల చిరంజీవి ముఖ్యమంత్రి కేసీఆర్ని కలిశారు. ఆ సమయంలో నాగార్జున కూడా ఉన్నారు. అయితే ఆ ఫొటోలో కేసీఆర్, నాగార్జునలు మాస్కులు ధరించలేదు. చిరుకి ఆ సమయంలో మాస్క్ ఉన్నా లేనట్టే. దాంతో.. ఇప్పుడు కేసీఆర్, నాగ్ లు కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.