రంగస్థలంలో రంగమ్మత్తగా మంచి ఫేమ్ సంపాదించుకుంది అనసూయ. అంతకు మందు ఆమె ఇమేజ్ వేరు.. రంగమ్మత్త తరవాత వేరు. అయితే.. రంగస్థలం తరవాత.. ఆ స్థాయిలో పాత్రలేవీ రావడం లేదు. వచ్చినా.. ఆ పాత్రల్లో అంత దమ్ము ఉండడం లేదు. తాజాగా.. మరో సినిమా ఒప్పుకుందట అనసూయ. ఈసారి రవితేజ సినిమాలో నటించడానికి సై అంది.
రవితేజ కథానాయకుడిగా `ఖిలాడీ` రూపొందుతున్న సంగతి తెలిసిందే. రమేష్ వర్మ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా కోసం ఇద్దరు కథానాయికల్ని ఎంపిక చేసేశారు. ఇప్పుడు మరో పాత్ర కోసం అనసూయని తీసుకున్నారని సమాచారం. ఈసారి కూడా అనసూయ హాట్ గా ఉండబోతోందట. ఈ సినిమాతో తనకు మరో రకమైన ఇమేజ్ రావడం ఖాయమని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది. ఇందులో అనసూయ స్టైలీష్‌గా, మరింత గ్లామరెస్ గా కనిపించబోతోందట. ప్రస్తుతం `క్రాక్` సినిమాతో బిజీగా ఉన్నాడు రవితేజ. ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.