ఇటీవల చిరంజీవి కి కరోనా పాజిటీవ్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ వేదికగా ధృవీకరించారు. `రెండు మూడు రోజులుగా నన్ను కలిసిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండండి` అంటూ సూచించారు. అంతకు ముందే నాగార్జున, చిరంజీవి కలిసి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ని కలిసొచ్చారు. అందుకే నాగార్జున, కేసీఆర్‌ల ఆరోగ్య పరిస్థితి ఏమిటా? అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. ఈ నేపథ్యంలో నాగార్జున కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు సమాచారం. ఈ పరీక్షల్లో ఆయనకు నెగిటీవ్ వచ్చిందని టాక్. ఇటీవల నాగ్ కులూమనాలీ వెళ్లొచ్చారు. ఇక్కడికి వచ్చిన వెంటనే ఆయన కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు తెలిసింది. చిరుకి కరోనా సోకిన నేపథ్యంలో… నాగ్ మరోసారి పరీక్షలు చేయించుకున్నారు.