తెరపై ఇద్దరు ముగ్గురితో ఆడిపాడందే బాలకృష్ణ సినిమా పూర్తవ్వదు. బోయపాటి స్టైల్ కూడా అంతే. సింగిల్ హీరోయిన్ తో సరిపెట్టడం ఇష్టం ఉండదు. వీరిద్దరూ కలిస్తే.. హీరోయిన్లకు కొదవేం ఉంటుంది? తాజాగా బాలకృష్ణ- బోయపాటి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు హీరోయిన్లు ఖరారయ్యారు. సాయేషా సైగల్, పూర్ణలను హీరోయిన్లుగా ఫిక్స్ చేశారు. అయితే ఇందులో మరో హీరోయిన్ కూడా ఉందని సమాచారం.
ప్రగ్యా జైస్వాల్‌ని మూడో హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. అయితే… ఈసారి ప్రగ్యా ఓ పాటకే పరిమితం కానున్నదని సమాచారం. బోయపాటి `సింహా`లో వ్యాంపు తరహా పాత్ర ఒకటుంది. ఆ పాత్రలో నమిత కనిపించింది. సరిగ్గా అలాంటి మసాలా పాత్రలోనే ప్రగ్యా జైస్వాల్ కనిపించనుందని టాక్. ప్రగ్యా రాకతో… ఈ సినిమాలో హీరోయిన్ల సంఖ్య ప్రస్తుతానికి మూడుకి చేరినట్టైంది.