తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి టార్గెట్‌గా వైసీపీలో చాలా “వైల్డ్”గా రాజకీయం నడుస్తోంది. ఆమెను ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరి చేయడమే కాదు.. పెద్ద ఎత్తున ఆడియో టేపులు కూడా విడుదల చేస్తున్నారు. అవి కూడా వ్యూహాత్మకంగా ఉంటున్నాయి. ఓ సారి పేకాట ఆడిద్దామనే ఆడియో టేప్‌ను విడుదల చేశారు. మరోసారి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిద్దామనే ప్లాన్‌తో ఆడియో విడుదల చేశారు. ఈ సారి ఏకంగా రెడ్డి సామాజికవర్గాన్ని నానా మాటలు అంటున్న ఆడియోను విడుదల చేశారు. వీటిని విడుదల చేస్తున్నది పార్టీ నుంచి సస్పెండ్ అయిన సందీప్ అనే ఎస్సీ నేత. ఆ మాటలు ఎమ్మెల్యే తనతో మాట్లాడారా లేకపోతే.. వెరెవరైనా ఆ టేపులు తనకు ఇస్తున్నారా అన్నదానిపై క్లారిటీలేదు. ఒక వేళ.. ఉండవల్లి శ్రీదేవి.. ఆ మాటలు సందీప్‌తోనే మాట్లాడి ఉంటే.. ఆయన అత్యంత సన్నిహిత అనచురుడిగాభావించాల్సి ఉంటుంది. మరి అంత సన్నిహితుడు ఎందుకు శత్రువుగా మారాడన్నది మరో కీలమైన అంశం.
వైసీపీలో నేతలంతా.. మీడియాతో మాట్లాడేది ఒకటి. అది పార్టీ ాఫీసు నుంచి స్క్రిప్ట్ వస్తుంది. బయట పిచ్చాపాటిగా మాట్లాడుకునేది మరొకటి. అది భిన్నంగా ఉంటుంది. ఫోన్లలో వాస్తవాలు మాట్లాడుకుంటారు. సాధారణంగా అందరూ ఒకటే కాబట్టి.. ఫోన్ల రికార్డింగ్‌లు లాంటివి పెట్టుకోరు. శ్రీదేవితో మంచిగా ఉన్న సమయంలోనే ఆ మాటలు మాట్లాడి ఉంటారు కాబట్టి.. రికార్డు చేసుకోవాలనే ప్లాన్ వారికి ఉండదు. మరి ఈ టేపులు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది ఆసక్తికరం. ఇదే వైసీపీలో కలకలం రేపుతోంది. ఉండవల్లి శ్రీదేవి మాట్లాడిన మాటలన్నీ.. దాదాపుగా ప్రతీ ఎమ్మెల్యే ఏదో ఓ సందర్భంలో మాట్లాడే ఉంటారని.. అది పార్టీ నేతల అభిప్రాయమని.. కానీ ఎలా బయటకు వచ్చిదంనేదే ఆసక్తికరం.
ఇటీవలి కాలంలో ఓ ఎంపీతో పాటు … తాజాగా.. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఓ ఎమ్మెల్సీ కూడాతాడికొండలో జోరు రాజకీయం చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. వారి రాజకీయానికి.. ఉండవల్లి శ్రీదేవికి చెక్ పెట్టేందుకు.. హైకమాండ్‌లోని కొంత మంది పెద్దలు సహకరిస్తున్నారని.. ఈ టేపులు వారి వద్ద నుంచే వస్తున్నాయన్న అనుమానాలు వైసీపీలో ప్రారంభమయ్యాయి. తమకు ఉపయోగపడరనుకున్న నేతకు చెక్ పెట్టడానికి ఇలాంటి ప్లాన్లు వైసీపీలో అమలవుతూంటాయని వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.