ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపుతున్న ఫైళ్లను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పెండింగ్‌లో పెడుతున్నారా..? . హైకోర్టుల్లో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగ విరుద్ధంగా ఉన్నాయన్న అభిప్రాయాలు వస్తూండటంతో.. ఆయన ఇటీవలి కాలంలో కీలక నియమకాల ఫైళ్లను పెండింగ్‌లో పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఫైళ్ల క్లియరెన్స్ కోసమే.. సీఎం జగన్.. హఠాత్తుగా గవర్నర్ నరిసింహన్ను కలిసినట్లుగా ప్రచారం జరుగుతోంది. గవర్నర్‌ను కలిసిన ముఖ్యమంత్రి దంపతులు.. దీపావళి శుభాకాంక్షలు చెప్పారు. ఆ తర్వత అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు మీడియా వర్గాలకు సమాచారం అందింది.
అదే సమయంలో.. గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న యూనివవర్సిటీ వైస్ చాన్సలర్ల నియామకాల ఫైల్‌పై కూడా చర్చ జరిగినట్లగా చెబుతున్నారు. వీసీల నియామకం విషయంలో ప్రభుత్వం గుట్టుగా పని చేసింది. ఇంత వరకూ ఏ ఏ యూనివర్శిటీకి ఎవర్ని పర్మినెంట్ వీసీగా నియమిస్తారో బయటకు రాలేదు. సెర్చ్ కమిటీలు సహా ఎలాంటి నిబంధనల్ని పాటించారో కూడా స్పష్టత లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి వర్శిటీల్లో నియామకాలు తీరు వివాదాస్పదమవుతోంది. పాలక మండళ్ల నియామక వివాదం ఇప్పటికే హైకోర్టు కు చేరింది. సభ్యులను ఎవరెవరు సిఫార్సు చేశారో కూడా.. నోట్ ఫైల్లో రాయడం వివాదాస్పదవుతోంది.
ఈ క్రమంలో వీసీల నియామకాల ఫైల్‌ను గవర్నర్ పెండింగ్‌లో పెట్టినట్లుగా చెబుతున్నారు. దీన్ని క్లియర్ చేయాలని.. జగన్ గవర్నర్ కోరారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. గవర్నర్‌తో భేటీలో పోలవరం అంశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలపై కూడా చర్చ జరిగినట్లగా తెలుస్తోంది.