సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించిన చిత్రం `ఉప్పెన`. శిష్యుడిదే సినిమా అయినా.. అన్ని విషయాల్లోనూ కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు సుకుమార్. ఈ సినిమా నిర్మాణంలోనూ ఆయనకు వాటా వుంది. ఈ సినిమా అవుట్ పుట్ పై సుకుమార్ పూర్తి నమ్మకంతో ఉన్నారు. కాకపోతే.. క్లైమాక్స్ విషయంలో ఆయనతో పాటు మైత్రీ మూవీస్ కూడా టెన్షన్ పడుతున్నట్టు టాక్.
ఈ సినిమా కథ సుఖాంతం కాదు. కాస్త విషాద భరితమైన ముగింపు అని తెలుస్తోంది. ఇలాంటి యాంటీ క్లైమాక్స్‌లు మనకు అంతగా నప్పవు. యాంటీ క్లైమాక్స్ లు ఉన్న సినిమాల్ని తెలుగు వాళ్లు కూడా అంతగా ఆదరించలేదు. కానీ..తమిళ జనాలకు మాత్రం బాగా నచ్చుతాయి. ఈ సినిమా అక్కడా విడుదల అవుతోంది. కాబట్టి.. క్లైమాక్స్ తమిళ ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని చిత్రబృందం ధీమాగా ఉంది. తెలుగులోనే ఎలాంటి రిజల్ట్ వస్తుందా? అని డౌటు పడుతున్నారు. ఈ సినిమాని సుకుమార్ ఇప్పటికే ఇండ్రస్ట్రీలోని తన కు అత్యంత సన్నిహితులకు చూపించాడని, వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేశాడని టాక్. వాళ్లంతా క్లైమాక్స్ కాస్త మారిస్తే బాగుంటుందేమో అన్న సలహా ఇచ్చారని తెలుస్తోంది. కానీ.. ఈ కథకు అయువు పట్టు అనుకుంటుందన్నదే అది. అదే మార్చేస్తే… ఈసినిమాని ఏ ఉద్దేశ్యంతో తీశామో అది మిస్సయిపోతుందని సుకుమార్ భావిస్తున్నాడు. క్లైమాక్స్ మార్చమని ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా అటు సుకుమార్ గానీ, ఇటు బుచ్చిబాబు కానీ ఒప్పుకోవడం లేదట. సుకుమార్ ఆర్డరేస్తే.. బుజ్జిబాబు పాటిస్తాడు. కానీ.. సుకుమార్‌కి సైతం.. ఈ క్లైమాక్స్ పై నమ్మకం ఉంది. కానీ మైత్రీ మూవీస్నిర్మాతలే… క్లైమాక్స్ ఏం చేస్తుందో అని.. టెన్షన్ పడుతున్నార్ట. క్లైమాక్స్ గనుక… నచ్చితే.. ఈ సినిమా సంచలన విజయం సాధించడంలో ఢోకా ఉండదని, అటూ ఇటూ అయితే.. మొదటికే మోసం వస్తుందేమో అని కాస్త కంగారు పడుతున్నారు. `ఉప్పెన` ఫలితం.. ఆ సినిమా క్లైమాక్స్ పై ఆధారపడి ఉందన్నమాట.