ఛానెల్ నడపటం అంటే ఇప్పుడు మరీ కష్టమయిపోతొంది.. రామేశ్వరరావు నడిపే టివీ9,10టివీ నుంచి, మేఘా వారి ఎన్ టివి కూడా కరోనా దెబ్బకు ఆర్దిక నష్టాలను చవి చూశాయి. ఒక్క సాక్షి ఛానెల్ మినహా దాదాపు అన్నీ న్యూస్ ఛానెల్స్ కాస్ట్ కటింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ కాలం వెళ్లదీస్తున్నాయి. ఎపి 24×7 ఛానల్ కష్టాలు మాత్రం మరీ వైవిధ్యంగా ఉంటాయి. ఎపి లో ఫస్ట్ న్యూస్ ఛానెల్ గా ప్రారంభమయి ,ఆంధ్రా ప్రజల మనసులో ప్రత్యేక స్దానాన్ని సంపాదించుకున్న ఈ న్యూస్ ఛానెల్ , అక్కడ వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిదానంగా డౌన్ ఫాల్ వైపు అడుగులు వేస్తూ వచ్చింది.
మురళీ కృష్ణంరాజు టేకోవర్ తర్వాత బాగుపడుతుందని ఉద్యోగులు భావించినా ,అడపా సుధాకర్ సిఇఓ గా ఎంపికయినా.. ఇప్పుడు ఛానెల్ దాదాపు కనుమరుగైపోయే పరిస్థితికి వచ్చింది. అడపా సుధాకర్ కి మీడియా వ్యవహారాలపై ఏమాత్రం అవగాహన లేదని, తనకు ఇష్టమైన,అసలేమాత్రం అర్హత లేని వ్యక్తులకు ఛానెల్ లో కీలక బాధ్యతలను అప్పగించటంతో న్యూస్ పరంగా , రేటింగ్ పరంగా ఎపి 24×7 సోయలో లేకుండా పోయిందని మీడియా సర్కిల్స్‌లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రతిభావంతులైన రిపోర్టర్స్, డెస్క్ సిబ్బంది ఉన్నప్పటికీ, అడపా సుధాకర్ బ్యాచ్ ,తమ అతి తెలివితో వారి పనికి కూడా భంగం కలిగించె స్దితిని తీసుకువచ్చారని టాక్. ఆరునెలలుగా ఈ ఛానల్ ఉద్యోగులకు జీతాలు లేవు. కొంతమంది ఇప్పటికే ఈ ఛానల్‌కి గుడ్ బై చెప్పేసి వెళ్లిపోయారు. మరి కొంత మంది అదే బాటలో ఉన్నారు. ఛానెల్ ని నమ్ముకుని, ఇంకా అంటిపెట్టుకుని ఉన్న ఉద్యోగుల్ని యాజమాన్యంలోకి కొంతమంది కీలకమైన వ్యక్తులు రకరకాల సాకులు చెప్పి, ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు తెలుస్తోంది.
జీతాలు ఇవ్వకపోతే, ఆఫీసుకు రాలేం.. అని ఉద్యోగులంతా తీవ్రంగా ఉద్యమించడంతో.. వాళ్లని శాంతించే కార్యక్రమం ఇప్పుడే ప్రారంభమైంది. ఎవరికి ఎంత ఇవ్వాలో ఓ లిస్టు ప్రిపేర్ చేశారు. అయితే.. ఆ మొత్తం భారీగా ఉండడం, మురళీ కృష్ణంరాజు రాజు కూడా ఛానెల్ కోసం డబ్బులు ఖర్చుచెసెందుకు వెనుకాడటం తో , పెద్దలందరు కలిసి ఎపి 24×7 చానెల్ ను మూసెసెందుకు సిద్ధమయ్యారని టాక్. తమ ఆరునెలలు జీతం లో ఎంతోకొంత వస్తుంది అని ఎదురుచూస్తున్న ఎంప్లాయిస్ కు ఇది పెద్ద షాక్. నిజానికి హైదరాబాదులోని ఎపి24×7 ఛానెల్ కార్యాలయంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని తెలుస్తోంది. ఈ కార్యాలయం అద్దె సైతం కొన్నాళ్లుగా కట్టలేదని, కనీసం ఆఫీసులో మంచి నీటి సౌకర్యాలు కూడా లేకుండా పోయాయని, ఇంటర్నెట్ కూడా నిలుపు చేశారని సమాచారం. విజయవాడ ఆఫీస్ రెంట్ కట్టకుంటే ,తాళం వెస్తామంటూ ఓనర్స్ నుంచి హెచ్చరికలు కూడా వచ్చాయి. కార్యాలయాల నిర్వహణే కష్టంగా ఉంటే, ఇక జీతాలిచ్చేదెప్పుడు..? దాంతో.. ఈ ఛానల్ పూర్తిగా మూసేసే రోజులు ఎంతో దూరంలో లేవని అక్కడ పనిచేసే ఉద్యోగులే వాపోతున్నారు.