అటు గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే.. ఇటు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అత్యంత కీలకమైన సమావేశానికి పిలుపునిచ్చారు. అయితే అది గ్రేటర్ ఎన్నికలతో సంబంధం లేనిది. అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని అత్యవసరంగా టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఉన్న పళంగా పార్టీ నేతలకు సమాచారం పంపారు. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితిక ిచెతందిన లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతీ ఒక్కరూ హాజరు కావాలని కేసీఆర్ స్పష్టం చేసింది.
మంత్రులు తమ జిల్లాలకు చెందిన ఎంపీలు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను సమన్వయం చేసుకుని సమావేశానికి తీసుకురావాలన్నారు. ఇంత హఠాత్తుగా కే్సీఆర్ ఎందుకు ర్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశాలను ఏర్పాటు చేశారన్నది చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అసెంబ్లీ సమావేశాలప్పుడు.. శాసనసభా పక్ష సమావేశం… పార్లమెంట్ సమావేశాలప్పుడు.. పార్లమెంటరీ పార్టీ సమావేశాలు నిర్వహిస్తారు. సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యవహారాలను చర్చిస్తారు. అలా కానప్పుడు… నాయకత్వంలో మార్పులు తేవాలనుకున్నప్పుడు.. ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకోవడానికి ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తారు.
ఇప్పుడు పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలేమీ లేవు. ఈ కారణంగానే… కేసీఆర్ ర్లమెంటరీ పార్టీ, లెజిస్లేచర్ పార్టీ సమావేశాలకు పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా చర్చల్లో ఉన్న అత్యంత కీలమైన అంశంపై ఏమైనా నిర్ణయం ప్రకటిస్తారా .. అన్నది టీఆర్ఎస్ లోనూ చర్చనీయాంశం అవుతోంది. ఈ సస్పెన్స్.. బుధవారం మధ్యాహ్నం వీడిపోయే అవకాశం ఉంది.