వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల ఆగడాలు.. అధికార పార్టీ వేధింపుల నుంచి ఇతరులు బయటపడాలంటే.. శని, ఆదివారాలు కూడా కోర్టులు తెరిచి ఉంచాలని.. ఏపీ బీజేపీ కీలక నేత.. విశాఖ ఉత్తర మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అంటున్నారు. విశాఖలో కొద్ది కాలంగా వారంతాల్లో అర్థరాత్రిళ్లు.. అధికారులు విరుచుకుపడుతున్నారు. టీడీపీ నేతల వ్యాపారాలను గురి పెట్టి కూలగొట్టడం … స్వాధీనం చేసుకోవడం చేస్తున్నారు. ఇలా వారాంతాల్లో అర్థరాత్రుళ్లే ఎందుకు చేస్తున్నారంటే… కోర్టుకు వెళ్లి తమ ఆస్తుల్ని కాపాడుకునే అవకాశం కూడా బాధితులకు కల్పించకూడదన్న ఉద్దేశమేనని ప్రత్యేకంగా విశ్లేషించాల్సిన అసరం లేదని రాజకీయవర్గాలు చెబుతూనే ఉన్నాయి.
ఈ క్రమంలో ప్రముఖ వ్యాపార వేత్త కూడా అయినా విష్ణుకుమార్ రాజు.. విశాఖలో నెలకొన్న పరిస్థితుల్ని తనదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే లోపల వేస్తున్నారని మండిపడ్డారు. విశాఖలో అక్రమ కట్టడాలని అంటూ..శుక్రవారం రాత్రి నుంచే కూలగొడుతున్నారని.. కోర్టులు కూడా శని,ఆదివారాలు కూడా తెరిచే విధంగా చూడాలని .. విశాఖలో బెంచ్ ఏర్పాటు చేయాలి..అప్పుడే న్యాయం జరుగుతుందని, లేకపోతే ప్రజలు భయభ్రాంతులకు గురి అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం అర్థరాత్రిళ్లు ముహుర్తం పెట్టుకుని కూలగొట్టిన.. గీతం, ఫ్యూజన్ ఫుడ్స్.. గంటా భూముల వంటి విషయాల్లో హైకోర్టులో స్టే లభించింది. దీన్ని దృష్టిలో పెట్టుకునే విష్ణుకుమార్ రాజు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పాలనపై ప్రజలు ఇప్పటికే విసిగిపోయారని.. మూడేళ్లలో ఆ ప్రభుత్వం కూలిపోతుందని అంటున్నారు. విష్ణుకుమార్ రాజు.. గతంలో జగన్ పై అభిమానంతో మాట్లాడేవారు. ఇప్పుడు వ్యతిరేకతత ోమాట్లాడుతున్నారు.