ఈమధ్య సినిమా టైటిళ్లు ఇంకాస్త క్రియేటీవ్ గా తయారవుతున్నాయి. కథలో మ్యాజిక్ ఉన్నా లేకపోయినా.. కొత్త రకం పేర్లు మాత్రం పెట్టడంలో.. దర్శకులు తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు. ఫలితంగా కొత్త పేర్లు పుట్టుకొస్తున్నాయి. నాని సినిమాకి `టక్ జగదీష్` అనే పేరు పెట్టారు కదా… అలా.
ఇప్పుడు రాజ్ తరుణ్ సినిమాకీ ఇలాంటి వెరైటీ పేరు ఒకటి పెట్టారు. అదేంటో తెలుసా..? `స్టాన్డప్.. రాహుల్` అట. చిన్నప్పుడు తరగతి గదిలో ఎవరైనా అల్లరి చేస్తే.. `స్టాన్డప్` అనే వారు కదా..? అలా `స్టాన్డప్ రాహుల్` అన్నమాట. శాంటో దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. వర్ష బొల్లమ్మ కథానాయిక. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. స్వీకార్అగస్తీ స్వరాలు సమకూరుస్తున్నాడు. వరుస ఫ్లాపులతో సతమవమవుతున్న రాజ్ తరుణ్‌కి ఇటీవల `ఒరేయ్ బుజ్జిగా`తోనూ బొప్పి కట్టింది. మరి.. ఈ రాహుల్ ఏం చేస్తాడో..?