నాని తీసిన థ్రిల్లర్ `హిట్`తో ఓ సూపర్ హిట్ కొట్టాడు విశ్వక్ సేన్. ఆ హిట్ తో యంగ్ హీరోల బ్యాచ్లో… మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరిపోయాడు. విరివిగా అవకాశాలు వస్తున్నా, ఆచి తూచి మాత్రమే కథల్ని ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు `పాగల్` గా అవతారం ఎత్తుతున్నాడు. నరేష్ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఇటీవల పాండిచ్చెరిలో షూటింగ్ ప్రారంభమైంది. కథానాయికగా ఇంత వరకూ ఎవరినీ ఎంపిక చేయలేదు. ఇప్పుడు ఆ ఛాన్స్ నివేదా పేతురాజ్కి దక్కింది. పాగల్ పక్కన నివేదని కథానాయికగా ఎంపిక చేసినట్టు సమాచారం. త్వరలో తాను కూడా సెట్లో పాల్గొనబోతోంది. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. టైటిల్ కి తగ్గట్టే హీరో క్యారెక్టరైజేషన్ ఉండబోతోందని చిత్రబృందం తెలిపింది. రథన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.