దుబ్బాక విజయంతో తాము తెలంగాణలో ప్రత్యామ్నాయం అయ్యామనుకుంటున్న భారతీయ జనతా పార్టీ గ్రేటర్ ఎన్నికల్లో బలహీనతలన్నింటినీ బయట పెట్టుకుంటోంది. అభ్యర్థులు లేక.. టీఆర్ఎస్లో టిక్కెట్ దక్కని వాళ్లు ఎవరు వచ్చినా బీఫాం ఇచ్చి.. కండువా కప్పేశారు. ఆ ప్రహసనం అలా ఉండంగా… తాజాగా.., పార్టీ ముఖ్య నేతలు.. ఇతర పార్టీల నేతల ఇళ్ల చుట్టూ.. చక్కర్లు కొడుతూండటం… విమర్శలకు కారణం అవుతోంది కాంగ్రెస్లో తమకు పరిచయం ఉన్న కొంత మంది పేర్లు రాసుకుని వారిళ్లకు వెళ్తున్నారు బీజేపీ నేతలు. అలా వెళ్తున్నారో లేదో.. ఇలా మీడియాకు లీక్ చేస్తున్నారు. వారు బీజేపీలోకి వస్తున్నారని ప్రచారం చేయించేసుకుంటున్నారు. తర్వాత అసలు విషయంపై ఆ నేతలు క్లారిటీ ఇచ్చిన తర్వాత బీజేపీకి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతోంది.
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డితో.. బీజేపీ నేతలు చర్చలు జరిపారని.. ఆయన బీజేపీలో చేరిపోతారని ప్రచారం చేసేశారు. చేరినట్లే అని మీడియాకు లీక్ ఇచ్చారు. తర్వాత ఆయన స్వయంగా ఆదో రూమర్ అని.. అన్ని పార్టీల్లోనూ తనకు స్నేహితులున్నారని తేల్చేశారు., దాంతో బీజేపీ నేతల ప్లాన్ అట్టర్ ఫ్లాపయింది. తర్వాత సర్వే సత్యనారాయణ విషయంలోనూ మరో పెద్ద బ్లండర్ చేశారు బీజేపీ నేతలు. సర్వేను .. రెండేళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆయన ఇంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడెళ్లి బీజేపీలోకి ఆహ్వానించి.. కాంగ్రెస్కు షాక్ అని ప్రచారం చేయించేశారు. దాన్ని చూసి రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్లు కూడా నవ్వుకునే పరిస్థితి.
భారతీయ జనతా పార్టీ పరిస్థితి నిజంగానే మెరుగుపడింది. ఇప్పుడు… ఇతర పార్టీల నుంచి వచ్చే నేతల కోసం… జిమ్మిక్కులకు పాల్పడి..ఆ మెరుగుపడటం అనేది… అపోహే అన్న అభిప్రాయాన్ని బీజేపీ నేతలే కల్పిస్తున్నారు. పార్టీ బలంగా మారితే.. నేతలే వచ్చి చేరుతారు. ఆ విషయం బీజేపీ నేతలకు తెలియనిది కాదు. కానీ ఇతర పార్టీల్ని బలహీనం చేయాలనో… తాము ఇన్స్టంట్గా బలబపడాలనో.. చేరికల్ని ప్రోత్సహించడానికి తాము దిగజారితే.. పార్టీ కూడా దిగజారిపోతుంది.. ఆ విషయం గుర్తిస్తారో లేదో మరి..!