టెక్నాలజీని సరిగ్గా వాడుకుంటే అభివృద్ది చెందవచ్చు… చెడుగా వాడుకుంటే చెడిపోవచ్చు. గుంటూరులో వంశీరెడ్డి అనే యువకుడు చెడుగా వాడుకున్నాడు. డబ్బు సంపాదన కోసం అశ్లీల సైట్లు.. యాప్ల బారిన పడి.. చివరికి తన భార్యనే.. వాటికి పెట్టుబడిగా మార్చాడు. డబ్బు సంపాదన కోసం కక్కుర్తి పడి.. కట్టుకున్న భార్యనే ఆన్లైన్లో పరిచయమైన వారికి తార్చే ప్రయత్నం చేశాడు. చివరికి ఆ భార్యకు విషయం తెలిసి.. పోలీసులకు ఆశ్రయించడంతో గుట్టు మొత్తం రట్టయింది.
గుంటూరు ఏటీ అగ్రహారంలో నివాసం ఉండే వంశీ రెడ్డి.. తన భార్యతో నివాసం ఉంటున్నాడు. ఉద్యోగం లేకపోవడంతో.. వ్యాపారం చేస్తున్నానని తిరుగుతూ ఉండేవాడు. ఓ కొరియర్ ఏజెన్సీని పెట్టి మూసేశాడు. ఆ తర్వాత జల్సాలకు అలవాటు పడ్డారు. డబ్బులు లేకపోవడంతో… భార్య అందాన్ని ఉపయోగించుకోవడం ప్రారంభించాడు. మొదట.. ఆమెతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసి.. అశ్లీల సైట్లకు అమ్మేవాడు. తర్వాత ఏకంగా లైవ్ పెట్టేవాడు. ఆ విషయం తెలియని భార్య… తన భర్తతో సంసారం చేస్తున్నానని అనుకునేది.
కొన్నాళ్ల తర్వాత వంశీ రెడ్డి.. భార్యను ఆన్ లైన్లో పరిచయం అయిన వారి వద్దకు పంపాలని నిర్ణయించుకున్నాడు. ఆమె వద్ద ఈ ప్రతిపాదన పెట్టాడు. అది విని ఆమె హతాశురాలైంది. అయితే.. అలా వెళ్లకపోయినా.. ఎవరికైనా చెప్పినా చచ్చిపోతానంటూ వంశీరెడ్డి..సైకోలా తనను తాను గాయపర్చుకునేవాడు. చివరికి.. అతని వేధింపులు తాళలేక భార్య పోలీసుల్ని ఆశ్రయించింది. దిశ పోలీసులు వంశీ రెడ్డి టెక్నికల్ హిస్టరీ అంతా వెలికి తీసి నోరెళ్లబెట్టారు. కట్టు కున్న బార్యతో అలా ఆన్ లైన్లో అశ్లీల వ్యాపారం చేయడం .. వంశీరెడ్డి నేర ప్రవృత్తికి నిదర్శనం అని అంటున్నారు.
నిజానికి అసలు వంశీ రెడ్డి ఆ యువతిని మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నారు. తాను ఎయిర్ ఫోర్స్లో పని చేస్తానని చెప్పి.. పెళ్లి చేసుకున్నారు. కనీ అతను ఎయిర్ ఫోర్స్ ఉద్యోగి కాదని పెళ్లి తర్వాతతెలిసింది. పెళ్లయిపోయింది కదా.. అమ్మాయి జీవితాన్ని నాశనం చేయడం ఎందుకని.. పెద్దలు రాజీ చేసి..కాపురానికి పంపారు. చివరికి అతను భార్యను అంగట్లో పెట్టేశాడు.