ఆస్కార్స్ అవార్డుల కోసం ప్రతీ యేటా.. భారతతీయ చలన చిత్ర రంగం నుంచి ఓ అఫీషియల్ ఎంట్రీ వెళ్తుంది. ఈసారి ఆ ఘనత.. `జల్లికట్టు`కి దక్కింది. 2019లో విడుదలైన ఈ మలయాళ చిత్రానికి లిజో జోస్ పెల్లిస్సేరి దర్శకత్వం వహించాడు. ఈసారి ఆస్కార్ బరిలో అర్హత కోసం 27 సినిమాలు పోటీ పడ్డాయి. అందులో ఛాలాంగ్, శకుంతాలాదేవి, గుంజన్ సక్సేనా, ఛపాక్, గులాబో సితాబో లాంటి హిందీ చిత్రాలు ఉన్నాయి. అన్ని అంశాలను సునిశితంగా పరిశీలించిన మీదట… జల్లికట్టును జ్యూరీ నామినేట్ చేసింది.
ఓ అడవి దున్న నేపథ్యంలో సాగే కథ జల్లికట్టు. మనిషిలోని అత్యాసకి, స్వార్థానికి ప్రతినిధిగా కనిపిస్తుంది. కథ, కథనాల పరంగానే కాదు, టేకింగ్ విషయంలోనూ ఈచిత్రానికి మంచి మార్కులు పడ్డాయి. సౌండ్ క్వాలిటీ సైతం అబ్బుర పరుస్తుంది. ఇన్ని లక్షణాలు ఉన్నాయి కనుకే.. ఇప్పుడు ఆస్కార్ బరిలో నిలిచింది. ఈ చిత్రం తెలుగులోనూ డబ్ అయ్యింది.