ఆస్ట్రేలియా, ఇండియా మధ్య తొలి వన్డే మ్యాచ్ జరుగిన సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో కాసేపు భారతీయ పారిశ్రామిక దిగ్గజం అదానీ మ్యాచ్‌ను నిలిపివేశారు. అయితే.. ఆయన నేరుగా ఈ మ్యాచ్‌ను నిలిపివేయలేదు. ఆయన ఆస్ట్రేలియాలో చేపట్టిన మైనింగ్ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్న అక్కడి ప్రజలు… నిరసనలు వ్యక్తం చేస్తూ.. గ్రౌండ్‌లోకి దూసుకు వచ్చారు. ఇద్దరు వ్యక్తులు స్టాప్ అదానీ ప్లకార్డులు పెట్టుకుని సెక్యూరిటీని చేధించుకుని దాదాపుగా పిచ్ వద్దకు వచ్చారు. దీంతో మ్యాచ్ కాసేపు ఆగిపోయింది.
వీరు మాత్రమే.. కాదు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ బయట మరో యాభై మంది నిరసనకారులు అదానీకి వ్యతిరేకంగా ఆందోళనలు చేశారు. భారత పారిశ్రామిక దిగ్గజమైన అదానీ.. ఆస్ట్రేలియాలో బొగ్గు గనులు తవ్వుతున్నారు. దీనికి సంబంధించి అక్కడి పర్యావరణ ప్రేమికులు… బొగ్గు గనుల సమీపంలో గ్రామాల వారు ఆందోళనలు చేస్తున్నారు. కానీ అదానీ పట్టించుకోవడం లేదు. అక్కడి ప్రభుత్వం కూడా మైనింగ్ కు పర్మిషన్ ఇచ్చింది. ఈ కోల్ మైనింగ్ ప్రాజెక్ట్ పై అప్పట్నుంచి వివాదాలు సాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఆ నిరసనలు ఇండియన్లకు తెలిసేలా నిరసన కారులు.. క్రికెట్ గ్రౌండ్‌లోకి దూసుకొచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రాజెక్టును చేపట్టి.. ఇండియాకు పెద్ద ఎత్తున బొగ్గు దిగుమతులుచేయాలనుకుంటున్న అదానీ గ్రూప్ ఇందు కోసం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద రుణం తీసుకుంటోంది. ఈ రుణం మంజూరు వ్యవహారం కూడా వివాదాస్పదం అవుతోంది.