2015లో విడుదలైన చిత్రం `పీకూ`. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె ప్రధాన పాత్రలు పోషించారు. విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అటు అమితాబ్ కీ, ఇటు దీపికాకి ప్రత్యేక గుర్తింపునీ, గౌరవాన్నీ తీసుకొచ్చింది, పురస్కారాలూ అందించింది. అప్పుడే ఈ చిత్రాన్ని దక్షిణాదిన రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ కుదర్లేదు. ఇంతకాలానికి ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో పునః నిర్మించబోతున్నారు. దీపికా పాత్రలో త్రిష కనిపించబోతోందని సమాచారం. అమితాబ్ పాత్రలో ఓ దక్షిణాదిలోని ఓ సీనియర్ నటుడు కనిపిస్తాడట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. తెలుగు నుంచి కూడా కొంతమంది అగ్ర నటుల పేర్లు ఈ పాత్ర కోసం పరిశీలిస్తున్నారు. హిందీలో నటించిన అమితాబ్ తోనే ఆ పాత్ర చేయించాలని భావించినా, బిగ్ బీ.. నో చెప్పడంతో మరో ఆప్షన్ ని వెదికే పనిలో పడ్డారు. అమితాబ్ పాత్రలో ఎవరు కనిపిస్తారు? అన్నది తెలిసిన వెంటనే.. ఈ సినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రానుంది.