ఓటీటీ కాలం ఇది. ఏటీటీలూ రెడీ అవుతున్నాయి. తెలుగులో తొలి ఏటీటీ శ్రేయాస్ దే. ఇప్పుడు మరో ఏటీటీ వస్తోంది. అదే.. `ఫ్రైడే మూవీస్`. ఎఫ్.ఎమ్ అనేది షార్ట్ ఫామ్. `ఆహా`ని నడుపుతున్న బ్యాచ్లో కొంతమంది వెనుక ఉండి… ఈ ఏటీటీని మొదలు పెడుతున్నారు. ఈ ఏటీటీలో త్రివిక్రమ్, సుకుమార్ లు కూడా భాగస్వాములుగా ఉన్నారన్నది ఇన్సైడ్ టాక్. వీళ్ల పెట్టుబడి, ఆలోచనలు కూడా ఈ ఏటీటీలో ఉన్నాయని సమాచారం అందుతోంది.
ఇప్పటికే `ఎఫ్.ఎమ్` వాళ్లు 10 సినిమాల వరకూ కొనుగోలు చేశారు. ఈ నెల 5న ఈ యాప్ లాంఛ్ అవ్వబోతోంది. 18 నుంచి సినిమాలు చూసుకోవచ్చు. పే ఫర్ వ్యూ పద్ధతిన.. ఈ ఓటీటీలో సినిమాలు ప్రదర్శితమవుతాయి. సెల్ ఫోన్ రిచార్జ్ చేసుకున్నట్టు… కొంత మొత్తం రీచార్జ్ చేయిస్తే చాలు. డబ్బులు ఉన్నంత వరకూ సినిమాలు చూసుకోవొచ్చన్నమాట. ప్లే బాక్, బొమ్మ బ్లాక్ బస్టర్, లింగొచ్చా లాంటి సినిమాలు ఈ యాప్ ద్వారా విడుదల అవ్వబోతున్నాయని తెలుస్తోంది.