బుల్లి తెరపై తిరుగులేని రారాణి.. సుమ. టీవీలో ఆమె కనిపించని రోజు లేదు. ప్రతీ ఛానలూ తనదే. సినిమా వాళ్ల ఫంక్షన్ అంటే సుమ యాంకరింగ్ ఉండాల్సిందే. వెండి తెరపై సుమ కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అయితే ఇప్పుడు సుమ ఓ వెబ్ మూవీ చేయబోతోందని టాక్. అయితే ఈ వెబ్ మూవీ లో సుమ భర్త రాజీవ్ కనకాల కూడా నటించబోతున్నాడట. ఓ యాడ్ ఫిల్మ్ మేకర్ ఈ వెబ్ మూవీకి దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కథ సిద్ధమైందని, సుమ, రాజీవ్ కలసి నటించడానికి ఓకే అన్నారని సమాచారం. ఆహాలో గానీ, జీ 5లో గానీ ఈ వెబ్ మూవీ ప్రసారం కాబోతోందట. సుమ – రాజీవ్ కనకాల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయని, ఇద్దరూ విడిపోతున్నారని జోరుగా ప్రచారం జరిగిందామధ్య. ఆ ప్రచారం తరవాతే.. వీరిద్దనూ బయట ఎక్కువగా కనిపిస్తున్నారు.కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇప్పుడు కలసి నటించబోతున్నారు కూడా. ఇవన్నీ చూశాకైన.. వీరి మధ్య గొడవలేం లేవని జనాలు అర్థం చేసుకుంటే బాగుంటుందేమో…?