ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. అంతే కాదు… టైటిల్ కూడా ప్రకటించేశారు. ఈ సినిమాకి `సలార్` అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అంటే… హింసాత్మక వ్యక్తి అని అర్థమట. దానికి తగ్గట్టుటానే ప్రభాస్ లుక్ ఉంది. చేతిలో ఓ తుపాకీ పట్టుకుని, రాయల్ గా కనిపిస్తున్నాడు ప్రభాస్. టైటిల్ ని, ప్రభాస్ లుక్ ని సైతం రివీల్ చేసేశారు. కేజీఎఫ్ నిర్మాతలే ఈ చిత్రాన్నీ తెరకెక్కించబోతున్నారు.
2021లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం కేజీఎఫ్ చాప్టర్ 2 పనుల్లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. అది పూర్తవ్వగానే `సలార్` స్క్రిప్టు పనులు మొదలైపోతాయి. కన్నడ చిత్రం `ఉగ్రమ్`కి ఇది రీమేక్ అని ప్రచారం జరుగుతోంది. దానిపై స్పష్టత రావాల్సివుంది.