సూపర్ స్టార్ తో సినిమా తీయాలని ప్రతి ఒక్క దర్శకుడికి ఉంటుంది. అయితే మహేష్ తో మళ్లీ మళ్లీ సినిమా అవకాశాలు ఇప్పించుకునేలా చేయాలంటే మహేష్ ఆ దర్శకుడిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి.. ప్రిన్స్ మహేష్ ను సూపర్ స్టార్ మహేష్ గా మలిచే క్రమంలో ఆయనకు పోకిరి, బిజినెస్ మేన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన దర్శకుడు పూరి మరోసారి మహేష్ తో సినిమా చేస్తున్నాడన్న వార్త తెలిసిందే. ప్రస్తుతం బ్రహ్మోత్సవం షూట్ లో ఉన్న మహేష్ ఆ తర్వాత మురుగదాస్ సినిమా చేస్తున్నాడు.
పూరి జగన్నాథ్ కూడా నందమూరి ఇద్దరు హీరోలతో చెరో సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. ప్రస్తుతం పూరి, మహేష్ లు తాము ఒప్పుకున్న సినిమాలను కంప్లీట్ చేసి మరోసారి ఇద్దరు కలిసి పనిచేయడానికి సుముఖంగా ఉన్నారట. ఈ మధ్యనే మహేష్ కి ఫైనల్ స్క్రిప్ట్ వినిపించడం దానికి మహేష్ కూడా ఓకే చెప్పడం జరిగిందట. సో మురుగదాస్ సినిమా తర్వాత సూపర్ స్టార్ నటించేది పూరి దర్శకత్వంలోనే అని దాదాపు కన్ఫాం అయినట్టే.
ఈ ప్రాజెక్ట్ సంవత్సరం చివరన పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చేసిన రెండు సినిమాలను హిట్ బాట పట్టించిన ఈ కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో చూడాలి.