కందిరీగ, హైపర్ చిత్రాలతో ఆకట్టుకున్నాడు సంతోష్ శ్రీనివాస్. ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో `అల్లుడు అదుర్స్` తీస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే బాలకృష్ణతో జట్టు కట్టే ప్రయత్నాల్లో ఉన్నాడు. బాలయ్య కోసం సంతోష్ శ్రీనివాస్ ఓ కథ రెడీ చేసుకున్నాడు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ లో ఈ కథ వినిపించాడు కూడా. ఆ కథ వాళ్లకు బాగా నచ్చింది. దాంతో బాలయ్యని లాక్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఈ సినిమా కోసం `బలరామయ్య బరిలోకి దిగితే..` అనే టైటిల్ కూడా రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ తరవాత… బి.గోపాల్ తో ఓ సినిమా చేయాల్సివుంది. ఈలోగా.. శ్రీవాస్ కూడా బాలయ్య కోసం ఓ కథ రెడీ చేస్తున్నట్టు సమాచారం అందుతోంది. ఇప్పుడు సంతోష్ శ్రీనివాస్ కూడా తన ప్రయత్నాలు మొదలెట్టాడు. చూద్దాం.. బాలయ్య ఎవరి కథకు ఓకే అంటాడో..?