గ్రేటర్ ఎన్నికల్లో సీట్ల పరంగా టీఆర్ఎస్ అతి పెద్ద పార్టీగా అవతరించింది. టీఆర్ఎస్ 55 డివిజన్లలో విజయం సాధిస్తే.. బీజేపీ 48 స్థానాల్లో కాషాయ జెండా ఎగరేసింది. నేరేడ్మెట్ డివిజన్లో కూడా బీజేపీ ఆధిక్యంలో ఉంది. కానీ, అభ్యర్థి మెజారిటీ కంటే స్టాంపు ఓట్లు ఎక్కువ ఉండడంతో ఇక్కడ ఫలితాన్ని నిలిపి వేశారు. గెలుపొందిన సీట్ల లెక్కన టీఆర్ఎస్సే ముందంజలో ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కలో మాత్రం కమలం విజయం సాధించింది. బీజేపీకి అత్యధికంగా 12,13,900 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది మొత్తం 31.43 శాతం.
టీఆర్ఎస్కు 11,89,250 ఓట్లు పోల్ అయ్యాయి. ఇది 30.79 శాతం. 2016లో బీజేపీకి వచ్చిన ఓట్లు 3,46,253 మాత్రేమ. ఈ సారి ఎనిమిదిన్నర లక్షల ఓట్లు అధికంగా పొందింది. గత ఎన్నికలతో పోలిస్తే 2.79 లక్షల ఓట్లను టీఆర్ఎస్ కోల్పోయింది. భారత ప్రజాస్వామ్యం మెజార్టీ మీద ఆధారపడి ఉంది.సీట్ల మెజార్టీలో అసెంబ్లీలలో లెక్కలు తేలుస్తాయి కాబట్టి ప్రభుత్వాలు ఏర్పడతాయి. ఆ లెక్కల ఓట్ల మెజార్టీలో బీజేపీ అనూహ్యమైన ఎదుగుదల నమోదు చేసింది. అధికార పార్టీ కన్నా అత్యధికంగా ఓట్లు సాధించడం అంటే.. మామూలు విషయం కాదు. ఈ విషయంలో భారతీయజనతా పార్టీ విజయం సాధించించింది.
భవిష్యత్లో తెలంగాణలో బీజేపీ ముద్ర వేయడానికి అవసరమైన బలాన్ని సంపాదించుకుంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. తరచూ ఓ మాట చెబుతూ ఉంటారు… నైతిక విజయం తమదేనని అంటూ ఉంటారు. ఇక్కడ… గ్రేటర్లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ.. అది ఓటమి కాదు.. నైతిక విజయంకూడా కాదు.. అసలైన విజయమేనని… వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. గ్రేటర్ లో అత్యధిక ప్రజలు కావాలని కోరుకున్నది బీజేపీని.ఇందులో ఎలాంటి సందేహం లేదు.