దైవం మనుష్య రూపేణా అన్నది గతం
రాష్యసం మనుష్య రూపేణా అన్నది ప్రస్తుతం – ఇదే జాంబీ రెడ్డి కాన్సెప్ట్. మనుషులు దెయ్యాల్లా మారితే.. పరిస్థితి ఏమిటన్న ఇతి వృత్తంతో తయారవుతున్న సినిమా `జాంబీరెడ్డి`. హాలీవుడ్ లో జాంబీ జోనర్లో సినిమాలు తయారవుతుంటాయి. అంటే మనుషులే… సడన్ గా దెయ్యాలుగా మారి, సాటి మనుషుల్ని పీక్కుతుంటుంటాయి. దాన్ని జాంబీ జోనర్ అంటారు. తెలుగులో మొదటి సారి ఈ జోనర్లో ఓ సినిమా తయారైంది అదే జాంబీ రెడ్డి.
ఆ, కల్కి సినిమాలతో ఆకట్టుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. బాల నటుడిగా పరిచయమైన తేజా సజ్జా ఈ సినిమాతో హీరో అవతారం ఎత్తాడు. ఇప్పుడు టీజర్ విడుదల చేశారు. కరోనా వైరస్ కోసం కనుకొనే టీకా వికటించడంతో, ఎలాంటి పరిణామాలు సంభవించాయన్నది కథ. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థ్రిల్లింగ్ గా అనిపించాయి. చిన్న సినిమా కావొచ్చు… కాకపోతే, విషయం ఉన్న సినిమాలా కనిపిస్తోంది. హారర్ సినిమాలన్నీ తెలుగులో ఓకే మూసలో వస్తున్నాయి. దానికి కాస్త ఇంటిలిజెన్సీ, హాలీవుడ్ టెక్నాలజీ, అక్కడి పడికట్టు సినిమా సూత్రాలూ ప్రయోగించిన తీసిన సినిమాలా అనిపిస్తోంది. అంతిమ ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.