చిరంజీవి `ఆచార్య`లో రామ్ చరణ్ సైతం ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో ఈ పాత్రే కీలకం. చరణ్ పక్కన ఓ కథానాయిక కూడా ఉంటుంది. ఇంత వరకూ ఆ హీరోయిన్ ని ఎంపిక చేయలేదు. కాకపోతే… బయట చాలా పేర్లే వినిపిస్తున్నాయి. సమంత, రష్మిక… ఇలా టాప్ స్టార్స్ పేర్లే చర్చకు వస్తున్నాయి.
అయితే.. ఈ సినిమా కోసం దక్షిణాది నుంచి కాకుండా ఉత్తరాది నుంచి కథానాయికని రంగంలోకి దించాలని చిత్రబృందం భావిస్తోంది. ఓ బాలీవుడ్ కథానాయిక చరణ్‌తో జోడీ కట్టే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇప్పటికే కొంతమందిని షార్ట్ లిస్ట్ చేశార్ట. అందులో ఒకరిని త్వరలోనే ఎంపిక చేస్తారు. చరణ్ తో పాటే, ఆ కథానాయిక కూడా సెట్స్‌పైకి వస్తుందని తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఓ కథానాయికగా కాజల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.