రాష్ట్ర ప్రభుత్వం రాజకీయ అవసరాల కోసం ఉత్తుత్తి జీవోల్ని విడుదల చేస్తున్న వైనం.. కలకలం రేపుతోంది. రాజకీయ కక్ష సాధింపుల కోసం సీబీఐ విచారణ కోసం అనేక సిఫార్సులను ఏపీ సర్కార్ చేసింది. దాంతో పాటు ప్రజల నుంచి వచ్చే డిమాండ్లను బట్టి… మరికొన్ని కేసుల్ని సీబీఐకి అప్పగిస్తూ జీవోలు ఇస్తోంది. కానీ ప్రభుత్వ నాన్ సీరియస్ వ్యవహారాల్ని సీబీఐ అంతేగా పరిగణనలోకి తీసుకుంటోంది. ఆయా కేసుల్లో విచారణ చేయడానికి సిద్ధం కావడం లేదు. అంతర్వేది ఘటన విషయంలో ఇంత వరకూ… సీబీఐ అసలు కేసు టేకప్ చేస్తుందో లేదో కూడా క్లారిటీ లేదు. అంతకు ముందే.. సుగాలి ప్రీతి కేసులోనూ ఇలాగే జీవో ఇచ్చారు . కానీ… ప్రభుత్వం ఉత్తినే ఆ జీవో జారీ చేసిందని సీబీఐకి అర్థమైపోయిది. ఆ జీవో ఎందుకీ పనికి రాదని తేల్చేశారు.
కర్నూలులో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిు విద్యార్థిని సుగాలీ ప్రతీ కేసును ప్రభుత్వం సీబీఐకి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కానీ.. సీబీఐ విచారణ ప్రారంభమయ్యేలా చేయడానికి తగ్గట్లుగా చర్యలు తీసుకోలేదు. సుగాలీ ప్రీతి తల్లిదండ్రులు ఎంతో ఉద్యమం చేసిన తర్వాత.. జనసేన సహా ఇతర రాజకీయపార్టీలు ఈ అంశంపై ఆందోళనలు చేసిన తర్వాత.. ఓ సారి సీఎం జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు సీబీఐ విచారణకు సిఫార్సు చేస్తున్నట్లుగా ప్రకటించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన 8 నెలలకు సీబీఐ విచారణకు ఆదేశించారు.. కానీ ఇప్పటి వరకు సీబీఐ విచారణ మొదలుపెట్టలేదు. ఇలా ఎందుకు జరుగుతోందని… సుగాలి ప్రీతి తల్లిదండ్రులు… ఢిల్లీ వెళ్లి సీబీఐ ఆఫీసులో కనుక్కుంటే.. ఏపీ సర్కార్ ఇచ్చిన జీవో ఎందుకూ పనికి రాదని తేల్చేశారు. దాంతో ఆ జీవో కాపీల్ని సుగాలి ప్రీతి తల్లిదండ్రుల్ని ఫేక్ గా పేర్కొంటూ.. మీడియా ముందు చించేశారు.
2017లో కర్నూలులోనే కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్ లో అనుమానాస్పద స్థితిలో సుగాలీ ప్రీతి చనిపోయింది. స్కూల్ యాజమాన్యానికి చెందిన వారే ఆమెను దారుణంగా హత్య చేశారని.. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని సుగాలి ప్రీతి తల్లిదండ్రులు అప్పటి నుండి ఉద్యమమం చేస్తున్నారు. జనసేన నేతలు..సుగాలి ప్రీతికి న్యాయం కోసం సోషల్ మీడియాలోపోరాటం చేస్తే.. పోలీసులు వేధింపులకు పాల్పడ్డారు. గొంతు నొక్కేయాలని ప్రయత్నించారు. సుగాలి ప్రీతికి న్యాయం కోసం జనసేన పూర్తి స్థాయిలో సహకారం అందిస్తోంది.