రైతులు పిలుపునిచ్చిన భారత్‌బంద్‌కు.. దేశవ్యాప్తంగా స్పందన కనిపిస్తోంది. సామాన్యుల నుంచి రాజకీయ పార్టీల వరకూ అందరూ స్వచ్చందంగా బంద్ పాటించారు. దుకాణాలు కూడా..మూత బడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలను కూడా మూసివేశారు. కార్మిక సంఘాలన్నీ మద్దతు పలకడంతో.. దేశవ్యాప్తంగా కార్యకలాపాలు నిలిచిపోయాయి. ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్స్ కూడా.. మద్దతు ప్రకటిచడంతో వాహనాలు కూడా.. ఆగిపోయాయి. ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా… ఢిల్లీ సర్కార్‌కు నిరసన తెలియచేయాలన్న లక్ష్యంతో రైతులు ఉండటంతో… మధ్యాహ్నం మూడు గంటల వరకే నిర్వహించాలని నిర్ణయించారు. ఆ మేరకు మూడు గంటలకు బంద్ విరమించారు. ఏ లక్ష్యంతో అయితే రైతులు భారత్ బంద్‌కు పిలుపునిచ్చారో ఆ లక్ష్యం నెరవేరింది. దేశ ప్రజలందరూ రైతులకు సంఘిభావం తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు రైతుల ప్రయోజనాలు కాపాడే విషయంలో ఏక తాటిపైకి వచ్చినట్లయింది.
ఒక్క బీజేపీ మాత్రం.. వ్యవసాయ బిల్లులను ఇప్పటికీ సమర్థించుకుంటోంది. రైతుల ఉద్యమానికి తమ వంతు సాయం చేయాలని విపక్ష పార్టీలు కూడా.. నిర్ణయించారు. విపక్ష నేతలందరూ.. రాష్ట్రపతిని కలవాలని నిర్ణయించారు. వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనను రాష్ట్రపతికి వివరిస్తారు. రాష్ట్రపతిని కలిసేముందు శరద్‌పవార్ నివాసంలో భేటీ అవుతారు. మరో వైపు ఢిల్లీ శివార్లలో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది. ఢిల్లీలోకి వచ్చే ప్రతీ రహదారిని రైతులు దిగ్బంధించారు. దీంతో… ఢిల్లీ స్తంభించిపోయినట్లయింది. ఇతర రాష్ట్రాల్లోనూ బంద్ ప్రభావం తీవ్రంగా కనిపించింది. దక్షిణాది రాష్ట్రాల్లో వ్యవసాయ చట్టాలపై పెద్దగా రైతులెవరూ.. రోడ్లమీదకు వచ్చి ఆందోళనలు చేయడం లేదు.
అయినప్పటికీ.. దక్షిణాదిలోనూ బంద్ విజయవంతం అయింది. అధికార పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. పార్లమెంట్లో ఓటింగ్ జరిపినప్పుడు… కనీస సవరణలు కూడా ప్రతిపాదించకుండా ఆమోదించడంలో కీలక పాత్ర పోషించిన వైసీపీ లాంటి పార్టీలు కూడా… బంద్‌కు సంఘిభావం ప్రకటించాయి. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ బంద్ విజయవంతం అయింది. ఇటీవలి కాలంలో రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా… రైతులే నిర్వహిస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్త స్పందన రావడం ఇదే తొలిసారి.