దిగ్గజ నటుడు దిలీప్ కుమార్ ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు ఆయన కుటుంబ వర్గాలు ధృవీకరించాయి. కొన్ని రోజులుగా దిలీప్ కుమార్ తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. తాజాగా ఆయనకు మరికొన్ని ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టినట్టు తెలుస్తోంది. కొన్ని రోజుల కింద ఆయన కరోనా బారిన పడ్డారు. అప్పట్నుంచి దిలీప్ ఆరోగ్యం విషమ పరిస్థితికి చేరుకుంది. దిలీప్ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పూర్తిగా తగ్గిపోయిందని, అయినా సరే, ఆయన పోరాడుతున్నారని దిలీప్ కమార్ భార్య సైరా భాను తెలిపారు. దిలీప్ కుమార్ సోదరులు ఎహసాన్ భాయ్, అస్లాం భాయ్ ఇటీవల కరోనాతో మృతి చెందారు. అప్పటి నుంచి దిలీప్ కుమార్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ప్రస్తుతం ఈయన వయసు 97 ఏళ్లు.