నాని తొలి రోజుల్లో చేసిన సినిమా `పిల్ల జమిందార్`. ఈసినిమాతో అశోక్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఆ సినిమా బాగా ఆడింది. కంటెంట్ ఉన్న సినిమా అది. పిల్లజమిందార్ తరవాత.. అశోక్ కొన్ని తప్పటడుగులు వేశాడు. `భాగమతి` హిట్టయినా, ఆ క్రెడిట్ తనకుదక్కలేదు. అయితే.. ఇప్పుడు `భాగమతి`ని బాలీవుడ్ లో రీమేక్ చేసి మళ్లీ వార్తల్లో నిలిచాడు అశోక్. `భాగమతి` దుర్గామతిగా రీమేక్ అయ్యింది. ఈనెల 11న అమేజాన్‌లో విడుదల కానుంది. ఈలోగా.. ఓ తెలుగు ప్రాజెక్టునీ మెల్లగా సెట్ చేసుకున్నాడు అశోక్. నానితో అశోక్ మరో సినిమా చేయబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్.
హీరో పేరు చెప్పడం లేదు గానీ “ఓ హీరోతో ఓ కథ ఓకే అయ్యింది. `పిల్ల జమిందార్`లో ఓ సున్నితమైన పాయింట్ ని వినోద భరితంగా చెప్పబోతున్నాం. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది” అని క్లారిటీ ఇచ్చాడు అశోక్.