కరోనా కారణంగా సడన్ బ్రేక్ వేసుకున్న సినిమా `పుష్ష`. యూనిట్ లో కొంతమంది సభ్యులకు కరోనా సోకినట్టు తెలియడంతో – ఉన్నట్టుండి `పేకప్` చెప్పేశారు. దాంతో ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా? అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మరో 20 రోజుల వరకూ పుష్ష షూటింగ్ కి వెళ్లదనుకున్నారంతా.
అయితే తెర వెనుక `పుష్ష` షూటింగ్ కి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఈనెల 13 నుంచి ఓ కొత్త షెడ్యల్ మొదలయ్యే ఛాన్సుందని సమాచారం. గత షెడ్యూల్.. మారేడుమల్లిలో జరిగింది. అక్కడ మరో 5 రోజుల షూటింగ్ బాకీ. కానీ… ఇప్పుడు చిత్రబృందం మారేడు మల్లి వెళ్లడం లేదు. హైదరాబాద్ శివార్లలోనే షూటింగ్ మొదలెడతారట. ఈసారి ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వీలైనంత తక్కువ మంది క్రూతో షూటింగ్ మొదలెట్టాలని భావిస్తున్నారు. కొంతమంది కీలక నటీనటుల డేట్స్ ఈనెల 12 నుంచి చిత్రబృందం తీసుకుందని, అయితే షూటింగ్ మాత్రం 13 నుంచి మొదలెట్టాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ లో బన్నీ ఉంటాడా లేదా? అనేది మాత్రం తెలియాల్సివుంది.