వెంకటేష్.. విక్టరీకి, వెరైటీకీ మారు పేరు. ప్రతీ సినిమాలోనూ ఏదో ఓ కొత్తదనం ఉండాలని పరితపిస్తుంటాడు. అందుకే ప్రతీ సినిమాలోనూ.. వెంకీ కొత్తగానే కనిపిస్తాడు. తన చేతిలో ఉన్న సినిమా `నారప్ప`. ఈ సినిమా కోసం వెంకీ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన ఓ చిన్న టీజర్ వచ్చింది. రేపు.. విక్టరీ వెంకటేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఒక రోజు ముందే.. చిత్రబృందం వెంకీ అభిమానులకు చిన్న టీజర్ రూపంలో బర్త్ డే గిఫ్ట్ పంపింది.
నారప్పగా.. వెంకీ పాత్రని పరిచయం చేస్తూ.. 27 సెకన్ల ఓ చిన్న టీజర్ విడుదల చేసింది చిత్రబృందం. అందులో వెంకీ ఎప్పటిలానే పవర్ఫుల్ గా కనిపించాడు. వెంకీ గెటప్, మణిశర్మ బీజియమ్.. `నారప్ప`ని సమ్‌థింగ్ స్పెషల్ గా మార్చాయి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఆయన సినిమాలన్నీ క్లాస్ టచ్‌తో సాగేవే. తొలిసారి ఆయన ఓ మాస్, రా.. కథని ఎంచుకున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. శ్రేయ కథానాయిక. చిత్రీకరణ తుది దశలో వుంది.