సంక్రాంతి సినిమా అంటే ఎలా వుండాలో రుజువు చేసింది ‘ఎఫ్ 2’. 2019 సంక్రాంతి విన్నర్ గా నిలిచిందీ సినిమా. తెలుగు ప్రేక్షకులు వినోదాన్ని ఏ రేంజ్ లో ఆదరిస్తారో ఈ సినిమా మరోసారి చాటింది. ఎఫ్2 గా వచ్చిన ఈ సినిమా బి2 గా బొమ్మ బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ సినిమాకి సీక్వెల్ వుంటుందని గతంలోనే ప్రకటించారు. దర్శకుడు అనిల్ రావిపూడి స్క్రిప్ట్ పనులు కూడా మొదలుపెట్టాడు.
ఈ రోజు హీరో వెంకటేష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా F3ని అధికారికంగా ప్రకటిస్తూ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు ఈ సినిమా కాన్సెప్ట్ ని కూడా నిర్మాత దిల్ రాజు తన ఫేస్ బుక్ లో పంచుకున్నారు. F2 భార్యల వలన భర్తలు ఫస్ట్రేషన్ కి గురైతే F3 డబ్బుల కారణంగా వచ్చే ఫస్ట్రేషన్ అని రాసుకొచ్చారు. కాన్సెప్ట్ పోస్టర్ కూడా ఈ పాయింట్ నే చూపిస్తుంది. తమన్నా, మెహరిన్ లు కూడా పోస్టర్ లో కనిపించారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుంది.