రానా నటిస్తున్న చిత్రం `విరాటపర్వం`. వేణు ఉడుగుల దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. నక్సలిజం నేపథ్యంలో సాగే అందమైన ప్రేమకథా చిత్రమని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. ఇప్పటి వరకూ విడుదల చేసిన సాయి పల్లవి, ప్రియమణి లుక్స్ లో… అదే కనిపించింది కూడా. ఈరోజు రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా `విరాటపర్వం`లోని రానా పాత్రని, లుక్‌ని పరిచయం చేశారు. ఈ సినిమాలో రవి అన్న పాత్రలో రానా కనిపించనున్నాడు. చేతిలో తుపాకీ, కళ్లలో తీక్షణత తో నక్సలైట్ పాత్రలో ఒదిగిపోయాడు రానా. ఈ పాత్ర కోసం.. రానా బరువు కూడా తగ్గాడు. బాహుబలి రానాకీ, విరాట పర్వం రానాకీ అస్సలు సంబంధమే లేదు. ఈ సినిమాలో ప్రతీ పాత్రకూ తనదంటూ ఓ గుర్తింపు ఉంటుందని, ప్రతీ పాత్రా తన ఉనికిని చాటుకుంటుందని, అందుకు తగిన నటీనటులనే ఎంచుకున్నామని చిత్రబృందం తెలిపింది. ఈరోజు 11 గంటలకు ఓ చిన్న టీజర్ కూడా విడుదల చేయనున్నారు.