`118` చిత్రంతో ఆకట్టుకున్న దర్శకుడు కెవి గుహన్. ఇప్పుడు మరో సినిమాని పట్టాలెక్కించారు. రాజశేఖర్ కుమార్తె శివానీ కథానాయిక. అథిత్ అరుణ్ కథానాయకుడు. ఈ చిత్రానికి `డబ్లూడబ్లూడబ్లూ`(హూ,వేర్,వై) అనే టైటిల్ ఖరారు చేశారు. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
కల్యాణ్ రామ్ హీరోగా నటించిన 118 ఓ థ్రిల్లర్. ఈసారీ ఆ తరహా కథాంశాన్నే ఎంచుకున్నారు గుహన్. అయితే ఈసారి కమర్షియల్ అంశాల్ని మరింతగా పొందుపరిచార్ట. స్వతహాగా కెమెరామెన్ అయిన గుహన్.. టెక్నికల్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఈసారి ఆ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుని, అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించార్ట. పతాక సన్నివేశాల్లో ఊహించని మలుపులు వస్తాయని, ఇంట్రవెల్ బ్యాంగ్ గుర్తుండిపోతుందని చిత్రబృందం చెబుతోంది. త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నారు. రాజశేఖర్ కుమార్తె శివానీ కెరీర్‌ని ఈ చిత్రం ఎలాంటి మలుపు తిప్పుతుందో చూడాలి.