ఓటీటీ హవా నడుస్తోంది. సీనియర్ దర్శకులు సైతం… వెబ్ సిరీస్, వెబ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఇటీవలే.. వి.ఎన్.ఆదిత్య ఓ సినిమా పట్టాలెక్కించారు. ఇందులో సునీల్ హీరో. ఇది ఓటీటీ కోసం తీసిన సినిమా. షూటింగ్ పూర్తయ్యింది. ఇప్పుడు వి.ఎన్.ఆదిత్య మరో వెబ్ మూవీని మొదలెట్టేశారు. దీనికి లవ్ @ 60 అనే పేరు పెట్టారు. రాజేంద్ర ప్రసాద్, జయప్రద జంటగా నటిస్తున్నారు.
ఏజ్ బార్ అయిన ఓ జంట ప్రేమ కథ ఇది. 60లో ప్రేమలో పడితే ఎలా ఉంటుందో చూపించబోతున్నారు. అయితే వినోదానికే పెద్ద పీట వేసి తీస్తున్న సినిమా ఇది. ఎమోషనల్ డ్రామా కూడా ఉంటుందట. త్వరలోనే ఈ వెబ్ మూవీ పట్టాలెక్కబోతోంది. నెల రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలన్నది దర్శక నిర్మాతల ధ్యేయం. పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.